
కార్గిల్: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది(Earthquake). హోలీ రోజున తెల్లవారుజామున 2.50 గంటలకు లడఖ్‌లోని కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ కనిపించాయి. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
EQ of M: 5.2, On: 14/03/2025 02:50:05 IST, Lat: 33.37 N, Long: 76.76 E, Depth: 15 Km, Location: Kargil, Ladakh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/7SuSEYEIcy— National Center for Seismology (@NCS_Earthquake) March 13, 2025
కార్గిల్‌లో భూకంపం సంభవించిన మూడు గంటలకే ఈశాన్య భారతదేశంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కామెంగ్ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటలకు ఇక్కడ భూకంపం సంభవించింది. మార్చి 13న మధ్యాహ్నం 2 గంటలకు టిబెట్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా లెహ్,లడఖ్(Leh, Ladakh) రెండూ భూకంప జోన్-IV పరిధిలోకి వస్తాయి. అంటే భూకంపాల పరంగా ప్రమాదం అధికంగా ఉన్న ప్రాంతాలివి. జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించిన సమయంలో తమ అనుభవాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నేడు హోలీ.. రంజాన్ ప్రార్థనలు.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
Comments
Please login to add a commentAdd a comment