జమ్ము కశ్మీర్‌లో భూకంపం | Ladakh Leh Jammu Kashmir Earthquake Latest News | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌లో భూకంపం

Jan 19 2026 12:36 PM | Updated on Jan 19 2026 12:58 PM

Ladakh Leh Jammu Kashmir Earthquake Latest News

భూకంపంతో జమ్ము కశ్మీర్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం ఉదయం భూ ప్రకంపనలు లఢాఖ్‌లోని లేహ్‌తో పాటు కశ్మీర్‌ ప్రజలను వణికించాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. 

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, ఈ భూకంపం ఉదయం 11:51 గంటలకు సంభవించింది. లేహ్‌ ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదు కాగా.. 171 కిలోమీటర్ల లోతులో భూకంపం పుట్టింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైంది. ఈ ప్రకంపనలు జమ్ము కశ్మీర్‌ రీజియన్‌ అంతటా ప్రభావం చూపాయి. అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. 

అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతం భూకంపాలకు నెలవు కూడా. అయితే ఆదివారం.. అఫ్ఘనిస్తాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇవాల్టి ప్రకంపనలు తాత్కాలికంగానే ఉన్నప్పటికీ, ఆఫ్టర్‌షాక్స్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement