ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక రిపోర్ట్ | Uttarkashi Flood ISRO Reveals Cause | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక రిపోర్ట్

Mar 7 2026 9:39 AM | Updated on Mar 7 2026 10:18 AM

Uttarkashi Flood  ISRO Reveals Cause

గతేడాది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో సంభవించిన వరదలపై ఇస్రో కీలక నివేదిక ఇచ్చింది. ఈ ఆకస్మిక వరదలకు కారణం  క్లౌడ్‌ బరస్ట్‌  కాదని తెలిపింది. ఆపై ప్రాంతంలో ఉన్న మంచుపర్వతం కరగడం వల్లే ఈ వరదలు సంభవించాయని  పేర్కొంది.

2025 ఆగస్టులో ఉత్తరకాశీలోని ధారాలి ప్రాంతంలో ఆకస్మికంగా వరదలు సంభవించాయి.  ఉన్నట్టుండి పెద్దఎత్తున వరదలు రావడంతో ఆ ప్రాంతమంతా మునిగిపోయింది. చాలా భవనాలు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. అయితే దీనికి కారణం క్లౌడ్ బరస్ట్ లేదా నదులు ఉప్పొంగడం అని అంతా భావించారు. అయితే దీనిపై పరిశోధన జరిపిన ఇస్రో  దీని కారణం క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చింది.

దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆసమయంలో ఆ ప్రాంతంలో ఎటువంటి వర్షాలు పడలేదని గుర్తించారు. అదే  విధంగా ఆ పై భాగంలోని పర్వతాలలో ఎటువంటి నదులు లేవని ఇస్రో తేల్చింది.  ఆ ప్రాంతానికి 5200 అడుగుల ఎత్తుల పర్వతాలలో మంచు పర్వతం కరగడం మూలంగానే ఆకస్మిక వరదలు సంభవించినట్లు తెలిపారు.

సాధారణంగా ఈ మంచు పర్వతాలకు రక్షణగా ఉండే పొరలు గ్లోబల్ వార్మింగ్ మూలంగా కరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాలుష్య పరిస్థితుల దృష్యా తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కనుక ఆ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement