
న్యూఢిల్లీ: నేడు ఒకవైపు హోలీ(Holi) మరోవైపు రంజాన్ శుక్రవారం ప్రార్థనల సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశరాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడేందుకు పారామిలిటరీ(Paramilitary) దళాలతో పాటు 25,000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఢిల్లీలో పోలీసులు 300కు పైగా సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి, డ్రోన్లు,సీసీటీవీ కెమెరాల సహాయంతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
#WATCH | Delhi Police conducted a flag march in the Malviya Nagar area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/pNSUYB1Xc1
— ANI (@ANI) March 13, 2025
ఇక హోలీ వేడుకలు ఘనంగా జరిగే రాజస్థాన్ విషయానికొస్తే రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైపూర్ అదనపు పోలీస్ కమిషనర్(Police Commissioner) (లా అండ్ ఆర్డర్) రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ పోలీసు విభాగానికి చెందిన 11 మంది అదనపు డిప్యూటీ కమిషనర్లు, 40 మందికి పైగా అసిస్టెంట్ కమిషనర్లు, 80 మంది సర్కిల్ ఆఫీసర్లు, దాదాపు 1500 మంది కానిస్టేబుళ్లు భద్రతా ఏర్పాట్లను చూసుకుంటారని తెలిపారు. అలాగే 300 మందికి పైగా మహిళా సిబ్బంది కూడా భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటారన్నారు. హోలీ రోజున పెద్ద సంఖ్యలో పర్యాటకులు జైపూర్‌కు తరలివస్తారని తెలిపారు.
#WATCH | Delhi Police conducted a bike rally in the Connaught Place area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/9yhAKsPs0I
— ANI (@ANI) March 13, 2025
శతాబ్దాల నాటి సనాతన ధర్మ సంప్రదాయాలను అనుసరించి, సామరస్యంగా హోలీ జరుపుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ సందర్భంగా ఎవరిపైన అయినా బలవంతంగా రంగులు వేయవద్దని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. పరస్పర గౌరవంతో జరుపుకునే పండుగలు మరింత ఆనందాన్ని ఇస్తాయన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు ఉన్నందున ప్రతి జిల్లాలోని శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హోలీ రోజున అణువణువునా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో పాటు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్, స్టంట్ బైకింగ్‌లపై నిఘా ఉంచడానికి ప్రత్యేక బృందాలను మోహరించామని యూపీ పోలీసు అధికారులు తెలిపారు. ఇదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి: హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment