సిబ్బంది కొరత.. పార్క్‌ల్లో అసౌకర్యాలు
మధిర: మధిర మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు పలు గ్రామాలను విలీనం చేయగా నానాటికీ కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆయా కాలనీల్లో ఎక్కడా రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్నా పదేళ్ల క్రితం నాటి పారిశుద్ధ్య సిబ్బందే ఉండడంతో చెత్త సేకరణ, వీధుల్లో శుభ్రం చేయడం సాఫీగా సాగడంలేదు. రూ.60 లక్షలతో ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన పార్కు నిర్వహణ లేక అధ్వానంగా మారింది. తహసీల్ వద్ద ఏర్పాటుచేసిన పబ్లిక్ టాయిలెట్ల తాళాలు తెరుచుకోవడం లేదు. ఈ ప్రాంతంలోని పార్కులోనూ ఆట వస్తువులు పాడయ్యాయి. సుదూరంగా డంపింగ్ యార్డ్ ఉన్నా కొన్ని వాహనాల డ్రైవర్లు అక్కడకు వెళ్లక రోడ్ల వెంటే చెత్త వేస్తున్నారు. నందిగామ రోడ్డులోని బ్రిడ్జి వద్ద డంపింగ్ యార్డ్‌ను తలపించే ఖాళీ స్థలంలో పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు సమీకృత మార్కెట్‌లో సౌకర్యాల కల్పన, అంబేద్కర్ సెంటర్‌లో బస్‌షెల్టర్ ఏర్పాటు, విలీన గ్రామాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాల్సి ఉంది.


