ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చింతకాని: పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ప్రతీ రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. చింతకాని మండలం వందనం, లచ్చగూడెం గ్రామాల్లో గురువారం అవగాహన కల్పించిన ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం కేటా యించే 11అంకెల నంబర్ కోసం పాసుపుస్తకం, ఆధార్ సంఖ్య, ఆధార్‌తోలింక్ అయిన ఫోన్‌నంబ ర్‌ను ఏఈఓలకు అందజేయాలని తెలిపారు. కాగా, ఎరువుల అమ్మకం యాప్ బుకింగ్ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే, పంటల నమోదుకు మార్చి 15వ తేదీ వరకు గడువు ఉన్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. సర్పంచ్‌లు ఆవుల నాగేశ్వరరావు, కొప్పుల రజిని, ఏఓ మానస, ఏఈఓలు ఆయేషా, మౌనిక పాల్గొన్నారు.


