యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అరెస్ట్: కారణం ఇదే.. | Former UCO Bank CMD Arrested In Money Laundering Case | Sakshi
Sakshi News home page

యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అరెస్ట్: కారణం ఇదే..

May 19 2025 2:53 PM | Updated on May 19 2025 3:17 PM

Former UCO Bank CMD Arrested In Money Laundering Case

యూకో బ్యాంక్ మాజీ సీఎండీ 'సుబోధ్ కుమార్ గోయెల్‌'ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. బ్యాంకు రుణ మోసం కేసులో.. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సుబోధ్ కుమార్ గోయెల్‌ను అరెస్ట్ చేసి కోల్‌కతాలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టు ముందు ఏదీ హాజరుపరచింది. కాగా యూకో బ్యాంక్ మాజీ సీఎండీని మే 21 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

యూకో బ్యాంక్ సీఎండీగా గోయెల్ పనిచేసిన సమయంలో కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు భారీ మొత్తంలో నిధులను మంజూరు చేశారు. ఇలా మంజూరైన రూ. 6,210.72 కోట్ల నిధులను ఆ సంస్థ దుర్వినియోగం చేసిందని.. సీబీఐ దర్యాప్తులో తెలిసింది. అంతే కాకూండా ఋణ మంజూరు విషయంలో.. సుబోధ్ కుమార్ గోయెల్‌ను ముడుపులు అందినట్లు కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: సంపన్న నటుడు.. టామ్ క్రూజ్ నెట్‍వర్త్ ఎంతో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement