
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగష్టు 6న రావాలని పేర్కొంది. అయితే, ఇప్పుడు జారీ చేసిన నోటీసులలో ఆగష్టు 11న హాజరుకావాలని సూచించింది. విజయ్ దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ప్రకాశ్ రాజ్‌ను జులై 30న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
