
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో(betting app case) ఈడీ విచారణకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సోనూసూద్‌కు ఈడీ ముందుకు వచ్చారు. 1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి ఆయనకు గతంలోనే ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే.
ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ మధ్యాహ్నం 12 గంటలకు సోనూ సూద్ విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనూసూద్‌తో పాటు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే వారిని కూడా విచారించారు. నిషేధిం ఉన్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు కూడా చిక్కుల్లో పడ్డారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్‌సింగ్, యువరాజ్‌సింగ్, సురేశ్ రైనాలను కూడా ఈడీ విచారించింది.