
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం (సెప్టెంబర్ 4, 2025) నోటీసులు జారీ చేసింది. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్‌కు ధవన్ ప్రమోషనల్ ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈడీ అధికారులు ధవన్‌ను Prevention of Money Laundering Act (PMLA) కింద విచారించనున్నారు. ఇదే కేసులో మరో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇదివరకే విచారణకు హాజరయ్యాడు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ కేసులో విచారణకు ఎదుర్కొన్నారు.
ఇదే కేసులో గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరి ప్లాట్‌ఫాంలలో బెట్టింగ్ యాప్స్‌కి ప్రాధాన్యత ఇచ్చారని ఈడీ అభిప్రాయడుతుంది.
కాగా, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతూ, పన్నుల ఎగ్గొడుతూ, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయనన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రియల్ మనీ గేమింగ్‌పై నిషేధం విధించింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా నల్లధనం, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీలు యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా సామాన్య ప్రజలు ప్రభావితం అవుతున్నారని, కొందరు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర భావిస్తుంది.