
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది.
‘గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్‌డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం.200లకుపైగా బ్యాంక్ పాస్‌బుక్‌లు సీజ్ చేశాం.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులు సీజ్ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని తెలిపింది.