
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు.
కాగా.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే గతంలోనే హాజరు కావాల్సి ఉండగా.. తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీని కాస్త సమయం కోరడంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సోమవారం విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు. అలాగే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష‍్మి హాజరు కావాల్సి ఉంది.
ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్‌ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు.