బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసిన 'సు ఫ్రమ్‌ సో' నటి | Su From So Movie Actress Sandhya Arakere Shares Baby Bump Pics | Sakshi
Sakshi News home page

ఇటీవలే సీమంతం.. బేబీ బంప్‌తో 'సు ఫ్రమ్‌ సో' నటి

Jan 2 2026 12:45 PM | Updated on Jan 2 2026 1:22 PM

Su From So Movie Actress Sandhya Arakere Shares Baby Bump Pics

కన్నడ నటి సంధ్య అరకెరె త్వరలో తల్లి కాబోతోంది. 'సు ఫ్రమ్‌ సో' మూవీలో సులోచన కూతురిగా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సంధ్య. అంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కన్నడ మూవీ 'సు ఫ్రమ్‌ సో'తో విశేష గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో సక్సెస్‌ అందుకుంటున్న ఈ నటి పర్సనల్‌ లైఫ్‌లో అంతకుమించి సంతోషంగా ఉంది. కారణం.. తానిప్పుడు గర్భవతి!

బేబీ బంప్‌ ఫోటోలు
2025 డిసెంబర్‌లో ఆమె సీమంతం జరిగింది. ఇప్పుడేమో భర్త, నటుడు శోధన్‌ బర్సూర్‌తో కలిసి బేబీ బంప్‌ ఫోటో షూట్‌ చేయించుకుంది. బేబీ కోసం వెయిటింగ్‌.. అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు కుట్టి సంధ్య కోసం మేము కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. రంగస్థల కళాకారిణి అయిన సంధ్య.. 'హిందే గాళి ముందె మత్తే' అనే షార్ట్‌ ఫిలింలోనూ యాక్ట్‌ చేసింది.

 

 

చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement