ఈడీ అదుపులో  జెన్సోల్‌ ప్రమోటర్‌!  | ED raids Gensol Engineering, detains co-promoter Puneet Singh Jaggi | Sakshi
Sakshi News home page

ఈడీ అదుపులో  జెన్సోల్‌ ప్రమోటర్‌! 

Apr 25 2025 4:16 AM | Updated on Apr 25 2025 7:50 AM

ED raids Gensol Engineering, detains co-promoter Puneet Singh Jaggi

కంపెనీ కార్యాలయాల్లో సోదాలు 

న్యూఢిల్లీ: జెన్సోల్‌ కంపెనీ ప్రమోటర్ల నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్‌లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)లోని నిబంధనల కింద ఈ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఉన్న కంపెనీ సహ ప్రమోటర్‌ పునీత్‌ సింగ్‌ జగ్గీని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 

మరో ప్రమోటర్‌ అన్మోల్‌ సింగ్‌ జగ్గీ దుబాయ్‌ల్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రమోటర్లు అన్మోల్‌ సింగ్‌ జగ్గీ, పునీత్‌ సింగ్‌ జగ్గీ కంపెనీ ఖాతాల నుంచి నిధులు మళ్లించారంటూ సెబీ దర్యాప్తులో తేలడం తెలిసిందే. ఇరెడా, పీఎఫ్‌సీ నుంచి ఈవీలు, ఈపీసీ కాంట్రాక్టుల కోసం తీసుకున్న రుణాలను ప్రమోటర్లు మళ్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్టు సెబీ గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement