
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 23న ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు. దీంతో ఆగ స్టు 11న హాజరు కావాలని ఈడీ అధికారులు సూచించారు.
ఈ కేసులో ఇప్పటికే జూలై 30న ప్రకాశ్‌రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యారు. కాగా, షెడ్యూ ల్ ప్రకారం ఈనెల 13న మంచు లక్ష్మి విచార ణకు హాజరు కావాల్సి ఉంది. మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చారు. మంచు లక్ష్మి విచా రణ అనంతరం మరికొంత మంది సెలబ్రి టీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.