అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట | ED To Clear Deposits For Agri Gold Victims | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట

Jun 13 2025 9:49 PM | Updated on Jun 13 2025 9:51 PM

ED To Clear Deposits For Agri Gold Victims

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తోంది ఈడీ.  కర్నాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో అగ్రిగోల్డ్‌ బాదితులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్‌ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్‌ లో ఇప్పటికే 33 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఈడీ.. వారి ఆస్తులను అటాచ్‌ చేసి బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తోంది

గత ఏడాది నవంంబర్‌లో ఈడీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్‌ చేసినట్లు కోర్టు గుర్తించింది. దీనిలో భాగంగా రూ. 4,141  కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌లో ఉన్న  ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. అగ్రిగోల్డ్‌ కేసులో ఇప్పటికే  పలువుర్ని అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement