తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే, హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో పతంగి టోల్‌గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించడంతో ఎమ్మెల్యే కొంత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


