అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు.. | ED Summons Anil Ambani Again in SBI Bank Fraud and Money Laundering Case Probe | Sakshi
Sakshi News home page

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు..

Nov 6 2025 2:42 PM | Updated on Nov 6 2025 2:59 PM

ED summons Anil Ambani to depose on Nov 14

న్యూఢిల్లీ: బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)రుణ మోసం కేసులో విచారణ కోసం నవంబర్ 14న విచారణకు రావాలని అనిల్ అంబానీని ఆదేశించింది. అనిల్అంబానీని ఇదివరకే గత ఆగస్టులో ఈడీ ఓసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది.

అప్పుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థలపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, సెబీ విచారిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే రిలయన్స్ గ్రూప్ సంస్థలకు చెందిన దాదాపు రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 30 ఆస్తులు, అధార్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, మోహన్ బీర్ హైటెక్ బిల్డ్, గమేసా ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, విహాన్ 43 రియల్టీ, కాంపియన్ ప్రాపర్టీస్ తో ముడిపడి ఉన్న ఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు.

రూ.17,000 కోట్ల బ్యాంక్‌ రుణాలు దారి మళ్లించినట్లు అనిల్‌ అంబానీ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, సెబీతోపాటు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కూడా రంగంలోకి దిగింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సీఎల​్‌ఈ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా పలు గ్రూప్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement