సినీ నటుడు రానాకు ఈడీ మళ్లీ సమన్లు | Enforcement Directorate Issue Fresh Summons To Rana Daggubati | Sakshi
Sakshi News home page

సినీ నటుడు రానాకు ఈడీ మళ్లీ సమన్లు

Jul 23 2025 4:22 PM | Updated on Jul 23 2025 4:26 PM

Enforcement Directorate Issue Fresh Summons To Rana Daggubati

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన కేసులో రానా(Rana Daggubati)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్ట్‌ 11 విచారణకు హాజరు కావాలని మసన్లలో పేర్కొంది. వాస్తవానికి నేడు(జులై 23) రానా ఈడీ విచారణకు హాజరు కావాల్సింది. కానీ ఆయన గడువు పొడిగించాలని ఈడీకి విజ్ఞప్తి చేశాడు. దీంతో తాజాగా మరో తేదిని ఖరారు చేస్తూ సమన్లు జారీ చేసింది. ఆగస్ట్‌ 11 కచ్చితంగా హాజరు కావాలంటూ సమన్లలో పేర్కొంది.

సైబరాబాద్, సూర్యా­పేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్‌ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే. లోన్‌ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement