సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకీ చుక్కెదురైంది. ఈడీ అధిాకారులపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. కాగా తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది.
దానితోపాటు ఐప్యాక్ ఆపీసులో సీసీ కెమెరాల, పుటెజ్‌ను భద్రపరచాలని , ఫైల్ చోరీ కేసులో సాక్షాలకు రక్షణ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఐప్యాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. "అధికారుల ఫోన్లు, కీలక డాక్యమెంట్లను మమతా బెనర్జీతో పాటు ఇతర అధికారులు లాక్కున్నారు. అనంతరం బెంగాల్ పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ను ధ్వంసం చేశారు. మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి" అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తును అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని బెంగాల్ సీఎం మమతతో పాటు పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.


