
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఈయన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ ప్రకాశ్ రాజ్‌తో పాటు మొత్తం 29 మందికి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరైన ఇతడు.. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ కి ప్రకాశ్ రాజ్ కౌంటర్)
'చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యాను. దయచేసి బెట్టింగ్ యాప్‌లలో ఆడకండి. కష్టపడి సంపాదించుకోండి. ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ తెలియక ప్రమోట్ చేశాను. అందులో నేను డబ్బులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను' అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇదే కేసులో రానా, మంచు లక్ష‍్మీ సహా చాలామంది యూట్యూబర్స్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్)