
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేస్‌లో ఈడీ అధికారుల విచారణకు సినీ నటుడు ప్రకాష్‌రాజ్ హజరయ్యారు. ఈ యాప్స్ ప్రమోషన్స్‌లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానించారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు నటుడు ప్రకాష్‌రాజ్ వెళ్లారు.
