ఈడీ, మోదీలకు బెదరం: ఉదయనిధి స్టాలిన్‌ | Tamil Nadu Udhayanidhi Stalin Counter To Modi And ED | Sakshi
Sakshi News home page

ఈడీ, మోదీలకు బెదరం: ఉదయనిధి స్టాలిన్‌

May 25 2025 7:26 AM | Updated on May 25 2025 12:40 PM

Tamil Nadu Udhayanidhi Stalin Counter To Modi And ED

పుదుక్కొట్టై: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను చూసి డీఎంకే భయపడదని ఆ పార్టీకి చెందిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తమపై పెట్టే కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు.

ఉదయనిధి స్టాలిన్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజల హక్కుల కోసం డీఎంకే పోరాటం కొనసాగిస్తుందని, ఎలాంటి బెదిరింపులకైనా భయపడబోదని చెప్పారు. తాత, మాజీ సీఎం కరుణా నిధి పెంచి పోషించిన డీఎంకే, హేతువాది పెరియార్‌ బోధించిన ఆత్మ గౌరవ నినాదానికి కట్టుబడిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. నిధి హక్కులు అడిగేందుకే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లారన్నారు. 

ఇదే సమయంలో ప్రతిపక్షనేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎవరో బెదిరిస్తే భయపడిపోయే పాలన తమది కాదన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా చట్టపూర్వకంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇండోర్‌ స్టేడియం పూర్తి చేయడానికి రూ.3.5 కోట్ల నిధులు కేటాయించారన్నారు. టాస్మాక్‌పై ఈడీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్‌ తొందరపడుతున్నారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే చేసిన వ్యాఖ్యలపై పైవిధంగా స్పందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement