‘చంద్రబాబు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఉంది’ | YSRCP RK Roja Fires On Chandrababu And Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఉంది’

Jul 28 2026 11:10 AM | Updated on Jul 28 2026 11:33 AM

YSRCP RK Roja Fires On Chandrababu And Nara Lokesh

సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై విచారణ జరిపించాలని.. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ఆమె మండిపడ్డారు. డీఎస్సీ స్కాం బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ ఎస్వీ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద వైఎస్సార్‌సీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. రూ. 7 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, రిక్రూట్ మెంట్‌లో అనర్హులకు పట్టం కట్టారు. 420 జీవో తీసుకొచ్చి.. 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది’’ అని ఆర్కే రోజా తేల్చి చెప్పారు.

‘‘191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులకు మూడు వేలు భృతి ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. కోటిన్నరకు పైగా నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. జగనన్న ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబును అడుగు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మహిళలు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. చంద్రబాబు.. నీ కొడుకు లోకేష్‌తో రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది

..లోకేష్‌ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగుతుంది. జగనన్న పాలనలో లక్ష 30 వేల పోస్టులు. ఆంధ్రజ్యోతి పేపర్‌కు, చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధం బయట పడింది. చంద్రబాబు నాయుడు ప్రాణం ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఉంది. ఆడ పిల్లలలపై అత్యాచారం జరిగితే కేసులు లేవు. భజన పత్రికలు కోసం చంద్రబాబు పనిచేస్తున్నారు’’ అని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement