ED: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం | Massive Fire Accident At ED Office Building In South Mumbai, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ED: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 12 ఫైరింజన్లు

Apr 27 2025 8:18 AM | Updated on Apr 27 2025 12:36 PM

Massive Fire Accident At Ed Office Building In South Mumbai

ముంబై: దక్షిణ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(Enforcement Directorate) కార్యాలయం ఖైసర్‌ ఏ హిందు భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఈ భారీ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఆదివారం తెల్లవారు జామన ఈడీ ఆఫీస్‌లో ప్రమాదం జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

పీటీఐ కథనం ప్రకారం.. కారింభోయ్ రోడ్డుపై ఉన్న గ్రాండ్ హోటల్ సమీపంలోని  కైసర్ ఐ హింద్ అనే  భవనంలో ఆదివారం ఉదయం 2:31 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందింది.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మొదట మామూలు మంటగా కనిపించినా, ఉదయం 3:30 గంటల సమయంలో మంటలు తీవ్రంగా మారడంతో దాన్ని లెవల్-2 (భారీ అగ్ని ప్రమాదం) గుర్తించారు. ఇక ఈ భవనంలోని నాలుగు,ఐదు అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగినట్లు మున్సిపల్‌ అధికారి తెలిపారు.  

ఘటన స్థలానికి 12 ఫైరింజన్లు, ఆరు జంబో వాటర్ ట్యాంకర్లు, ఒక ఎరియల్ వాటర్ టవర్ టెండర్, ఒక బ్రెతింగ్ అపారాటస్ వాన్, రెస్క్యూ వాన్, క్విక్ రెస్పాన్స్ వాహనం, అలాగే  అంబులెన్స్‌ సైతం అందుబాటులో ఉంచారు.  అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement