
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది.

దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది.

