
నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)కు చిక్కులు తప్పవని తెలుస్తోంది. తాజాగా ఈడీ విచారణకు ఊర్వశి హాజరైంది. కొద్దిరోజుల క్రితం విచారణకు రావాలని ఆమెకు ఈడీ కార్యాలయం సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంత డబ్బు సంపాదించారు..? తనను వారు ఎలా సంప్రదించారు..? మనీ ట్రాన్షక్షన్స్ ఎలా చేస్తారు..? వంటి అంశాల గురించి ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లోని స్టార్స్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, సోనూ సూద్ వంటి స్టార్స్‌తో పాటు సురేశ్ రైనా వంటి క్రికెటర్స్ కూడా ఈ కేసులో ఉన్నారు.