సినిమా నచ్చకపోతే మందుబాటిల్‌ ఇప్పిస్తా: దర్శకుడు | Director Varun Reddy Speech at Psych Siddhartha Success Meet | Sakshi
Sakshi News home page

మందు తాగి లొల్లి పెడదాం.. నచ్చలేదంటే క్వాటర్‌ ఇప్పిస్తా!

Jan 3 2026 7:17 PM | Updated on Jan 3 2026 7:51 PM

Director Varun Reddy Speech at Psych Siddhartha Success Meet

శ్రీనందు హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ సైక్‌ సిద్దార్థ. యామిని భాస్కర్‌ హీరోయిన్‌గా నటించగా వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి నిర్మించిన ఈ మూవీ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సక్సెస్‌ మీట్‌
పాజిటివ్‌ టాక్‌తో తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోందీ మూవీ. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వరుణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాస్‌ ఆడియన్స్‌ నిష్కల్మషంగా సినిమా చూస్తారు. వాళ్లే సినిమాను థియేటర్‌లో నిలబెడతారు. థియేటర్లలో అరుపులు ఊరికే రావు. ఎన్నో సినిమాల్లో ఎంతో ట్రై చేశారు, కానీ పేలలేదు. 

మందు తాగి లొల్లి పెడదాం
కానీ, మా సినిమాకు విపరీతంగా క్లాప్స్‌ కొడుతున్నారు, ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్స్‌కు గట్టిగా కనెక్ట్‌ అయ్యారు. క్వాటర్‌ మందు తాగి లొల్లి పెడదాం మామ, ఫుల్‌ ఎంజాయ్‌ చేద్దాం మామ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంకిత. సెకండాఫ్‌లో మునుపు ఏ సినిమాలోనూ చూడనంత కేకలు మా సినిమాకు చూశాను. గ్యాంగ్స్‌తో కలిసి సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి. మీరు క్లైమాక్స్‌ వరకు కేకలు పెడుతూ బయటకు రాకపోతే నేను మందు క్వాటర్‌ ఇప్పిస్తా.. అన్నాడు.

చదవండి: పోకిరి విలన్‌కు యాక్సిడెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement