
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)ని జూలై 23న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రకాశ్ రాజ్‌ను జూలై 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది.
సెలబ్రిటీలపై కేసు
కాగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటివరకు దాదాపు 25 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. వీరిలో ప్రకాశ్ రాజా, రానా, మంచు లక్ష్మితో పాటు ప్రణీత, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, అనన్య నాగళ్ల తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌కు వీరు భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణలో.. ఆ లావాదేవీల గురించి ఈడీ ఆరా తీయనుంది.

చదవండి: యాక్సిడెంట్.. పక్షవాతం రావొచ్చన్నారు, అప్పుడు తమన్..: సింగర్