సాక్షి,హైదరాబాద్: ఐబొమ్మ ఇమ్మడి రవి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. సినిమా పైరసీకి సంబంధించిన కేసును తెలంగాణ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐబొమ్మ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.
ఇందులో భాగంగా ఐబొమ్మ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు లేఖ రాసింది. ఐబొమ్మ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి రాసిన లేఖలో పేర్కొంది.
కాగా,అరెస్టు సమయంలో ఐబొమ్మ ఇమ్మడి రవి బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు గుర్తించారు. నెలకు రూ. 15 లక్షలు రూపాయలు క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్‌ఆర్‌ఈ ఖాతాకు ట్రాన్స్‌ఫరయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో వీటిపై ఈడీ దర్యాప్తు చేయనుంది.


