రూ.2,000 కోట్లు దోచేసే కుట్ర | Sonia, Rahul Gandhi wanted to usurp Rs 2,000 crore AJL company | Sakshi
Sakshi News home page

రూ.2,000 కోట్లు దోచేసే కుట్ర

Jul 3 2025 5:01 AM | Updated on Jul 3 2025 5:01 AM

Sonia, Rahul Gandhi wanted to usurp Rs 2,000 crore AJL company

ఏజేఎల్‌ ఆస్తులు కొట్టేయడానికి సోనియా, రాహుల్‌ ప్రయత్నించారు 
 

హెరాల్డ్‌ కేసులో ఈడీ వాదనలు 

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు దోచుకొనే కుట్ర జరిగిందని ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలియజేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన ఆస్తులను కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ చట్టవిరుద్ధంగా సొంతం చేసుకొనేందుకు ప్రయ త్నించారని వెల్లడించింది. 

నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో బుధవారం ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో సోనియా, రాహల్‌కు 76 శాతం వాటాలున్నట్టు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు పేర్కొన్నారు. ‘‘ఆ సంస్థ ద్వారా ఏజేఎల్‌కు కేవలం రూ.90 కోట్ల రుణమిచ్చి దాన్ని తీర్చడం లేదన్న సాకుతో ఏజేఎల్‌కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి కుట్ర చేశారు. యంగ్‌ ఇండియా స్థాపనే దురుద్దేశపూరితం’’ అన్నారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement