
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్నీమధ్యే 29 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మెటాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
గూగుల్, మెటా కంపెనీలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేస్తున్నాయన్నది ఈడీ అభియోగం. సదరు యాప్‌లు మనీలాండరింగ్, హవాలా లావాదేవీలలాంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై దర్యాప్తు ఎదుర్కొంటున్నాయి. అయితే అలాంటి యాప్‌లకు తమ పేజీల్లో స్లాట్‌లు కేటాయిస్తూ విపరీతంగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయని ఈడీ అంటోంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన విచారణకు రావాంటూ గూగుల్, మెటాలకు ఈడీ స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ఆయా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.