
కోల్‌కతా: ప్రాథమిక పాఠశాలల్లో నియామకాల అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రకాంత్ సిన్హా శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సిన్హా ఈడీ కోర్టులో హాజరై లొంగుపోతున్నట్లు ప్రకటించారని ఈడీ అధికారులు తెలిపారు.
కాగా, కేసు విచారణకు గాను ఆయన్ను ఈడీ కస్టడీ కోరగా కోర్టు తోసిపుచ్చింది. షరతులకు లోబడి రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోల్‌కతా లేదా సొంత నియోజకవర్గం వీడి వెళ్లరాదని సిన్హాను కోర్టు ఆదేశించింది అని అన్నారు. కాగా, బిర్హుమ్ జిల్లాలోని బోల్‌పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.