కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముర్షిదాబాద్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠం ఎక్కనివ్వబోనని ప్రతినబూనారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కున్న ముస్లిం ఓటు బ్యాంకు ఇక గల్లంతేనని స్పష్టం చేశారు. అసలు కథ ముందుందంటూ హెచ్చరికలు చేశారు.
ముందుగా ప్రకటించిన విధంగానే శనివారం బెల్డంగలో బాబ్రీ తరహా మసీదుకు పునాది రాయి వేయడం తెల్సిందే. పోలీసులు ఈ కార్యక్రమానికి సహకారం అందించకున్నా 8 లక్షల మంది తరలివచ్చారన్నారు. విరాళాలు ఇటుకలు, డబ్బు రూపంలో వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఈ నెల 22న సొంతపార్టీ ఏర్పాటును ప్రకటిస్తానని, ముస్లింల సంక్షేమం కోసం పనిచేసే తమ పార్టీ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోని 294 స్థానాలకు గాను 135 చోట్ల బరిలో ఉంటారన్నారు.
ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో మాట్లాడి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను తాము మలుపు తిప్పబోతున్నట్లు చెప్పారు. టీఎంసీయే కాదు, బీజేపీకి కూడా రాష్ట్రంలో అధికారం దక్కనివ్వబోమని తేలి్చచెప్పారు. అదేవిధంగా, మసీదు నిర్మాణానికి పునాది రాయి వేసిన బెల్డంగలోని రెజినగర్‌లో ఫిబ్రవరిలో లక్ష మందితో ఖురాన్ పఠనం చేపడతామన్నారు. పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. హాజరైన వారికి బిర్యానీతో విందు ఉంటుందని వివరించారు.


