సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ రఘువంశీ | Cbi Arrests Deputy Director Of Ed In Bribery Case | Sakshi
Sakshi News home page

సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ రఘువంశీ

May 30 2025 6:09 PM | Updated on May 30 2025 7:01 PM

Cbi Arrests Deputy Director Of Ed In Bribery Case

ఒడిశా: లంచం తీసుకుంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) డిప్యూటీ డైరెక్టర్‌ చింతన్‌ రఘువంశీ సీబీఐ వలకు చిక్కారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసుకు సంబంధించి.. భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.

ఏడాదిన్నరగా రఘువంశీ భువనేశ్వర్ జోనల్ కార్యాలయంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని అరెస్ట్ చేసిన అధికారులు.. భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ధెంకనల్‌కు చెందిన స్టోన్ మైనింగ్ ఆపరేటర్ రతికంత రౌత్‌పై గతంలో ఒక ఈడీ కేసు నమోదైంది.

ఈ కేసులో అతని వద్ద నుంచి రఘువంశీ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.5 కోట్ల లంచంలో భాగంగా మొదటి వాయిదా కింద రూ.20 లక్షలు.. రఘువంశీకి రౌత్ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు.. వల వేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.


 

 


 

Advertisement
 
Advertisement
Advertisement