సాక్షి, హైదరాబాద్: ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని అరెస్ట్ చేసింది. భారీ స్థిర, చర ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. రూ.400 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.
10 అపార్ట్‌మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో పాట్లను గుర్తించారు. ఆంజనేయనగరంలో జీప్లస్ త్రీ కమర్షియల్ భవనం, బేగంపేటలో జీప్లస్ 5 కమర్షియల్ భవనాన్ని అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భార్య పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు కూడా గుర్తించారు. 2 కిలోల బంగారం, బ్యాంక్ ఖాతాల్లో రూ.52 లక్షలు ఫ్రీజ్ చేశారు. మొత్తం తొమ్మిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.


