breaking news
transco DE
-
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని అరెస్ట్ చేసింది. భారీ స్థిర, చర ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. రూ.400 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.10 అపార్ట్మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో పాట్లను గుర్తించారు. ఆంజనేయనగరంలో జీప్లస్ త్రీ కమర్షియల్ భవనం, బేగంపేటలో జీప్లస్ 5 కమర్షియల్ భవనాన్ని అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భార్య పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు కూడా గుర్తించారు. 2 కిలోల బంగారం, బ్యాంక్ ఖాతాల్లో రూ.52 లక్షలు ఫ్రీజ్ చేశారు. మొత్తం తొమ్మిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
ట్రాన్స్‌కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో (TRANSCO)లో డివిజనల్ ఇంజినీర్ (డీఈ)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంతంలో ఉన్న మీనాక్షి స్కై లాంచ్ అపార్ట్మెంట్లోని వెంకటరమణ నివాసంతో పాటు, ఆయనకు సంబంధించిన ఇతర ప్రదేశాల్లోనూ ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లాకర్ల సమాచారం తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తనిఖీలు పూర్తి అయ్యాక అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏసీబీ బృందాలు సేకరించిన ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. -
గుంతకల్లు డీఈ అవినీతి బాగోతం
సాక్షి, అనంతపురం : గుంతకల్లు ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు కోసం రైతుల నుంచి డీఈ రవిబాబు లక్షన్నర లంచం తీసుకున్నారు. ఇద్దరు రైతులు కలిసి లక్షన్నర లంచం ఇవ్వగా ఈ సొమ్ము లైన్ మెన్ ద్వారా డీఈకు చేరింది. కాగా రవిబాబు బాగోతాన్ని రైతులు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో డీఈ రవిబాబు దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా రైతులను వేధిస్తున్నట్లు డీఈ రవిబాబు పై కొంతకాలంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒక్కొ కొత్త ట్రాన్స్ ఫార్మర్కు 75000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు దళారుల సహకారంతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్‌కో డీఈ రవిబాబు అవినీతి బాగోతం
-
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో డీఈ
ఖమ్మం: పని పూర్తిచేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ట్రాన్స్కోశాఖలో డీఈ గా పనిచేస్తున్న సుదర్శన్ అదే శాఖలో జూనియర్ లైన్మెన్ గా పనిచేసి సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు తనకు రావాలసిన ఏరియర్కు సంబంధించిన డబ్బులు ఇప్పించాల్సిందిగా డీఈని సంప్రదించారు. ఈ పనిచేయాలంటే రూ.25 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సుదర్శన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతనితో పాటు ఏజెంట్‌గా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డితో పాటూ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


