ఈడీ విచారణకు రాబర్ట్‌ వాద్రా.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో టెన్షన్‌ | ED Office Summoned Notices To Robert Vadra | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణకు రాబర్ట్‌ వాద్రా.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో టెన్షన్‌

Published Tue, Apr 15 2025 11:30 AM | Last Updated on Tue, Apr 15 2025 11:55 AM

ED Office Summoned Notices To Robert Vadra

ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు బిగ్‌ షాక్‌ తగిలింది. హర్యానాలోని శిఖోపూర్‌ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు వాద్రాకు మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. 

ఈ క్రమంలో ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీ నోటీసులపై..‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు ​​పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా.. రాబర్ట్‌ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ.. రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీంతో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబర్ట్‌ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీంతో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement