
బాలీవుడ్ హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిపై కొద్దిరోజులుగా ఈడీ దూకుడు చూపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లోని స్టార్స్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.