
ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణలు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–కామర్స్ సంస్థ మింత్రాపై విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదైంది. రూ. 1,654 కోట్ల పెట్టుబడుల విషయంలో మింత్రాతో పాటు, దానితో సంబంధమున్న కంపెనీలు, డైరెక్టర్లపై తమ బెంగళూరు జోనల్ ఆఫీసు ఫిర్యాదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ పేరిట విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరించిన మింత్రా, దాని అనుబంధ కంపెనీలు మలీ్ట–బ్రాండ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ.
కంపెనీ సింహ భాగం ఉత్పత్తులను వెక్టార్ ఈ–కామర్స్ సంస్థకు విక్రయిస్తోండగా, సదరు కంపెనీ అంతిమంగా కస్టమర్లకు రిటైల్‌గా విక్రయిస్తోందని ఈడీ వివరించింది. ఈ రెండు సంస్థలూ ఒకే గ్రూప్‌లో భాగమని తెలిపింది. మరోవైపు, చట్టాలను తాము గౌరవిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని మింత్రా ప్రతినిధి తెలిపారు. డిజిటల్ కామర్స్ ద్వారా దుస్తుల పరిశ్రమకు సాధికారత కలి్పంచడం ద్వారా దేశ నిర్మాణానికి కంపెనీ తన వంతు తోడ్పాటు అందిస్తోందన్నారు. ప్రస్తు నిబంధనల ప్రకారం మార్కెట్‌ప్లేస్ విధానంలో కార్యకలాపాలు సాగించే కంపెనీల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులున్నాయి. 2007లో ఏర్పాటైన మింత్రా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగంగా ఉంది.