
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. తాజాగా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్‌లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ మాజీ క్రికెటర్లను ఈడీ విచారించనుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. ఈ నెల 22న ఉతప్ప, 23న యువరాజ్ సింగ్‌లు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ దావన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది.