సాక్షి, హైదరాబాద్: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ రూ.300 కోట్లు అక్రమాలు చేసిందని, అంతేకాకుండా ప్రభుత్వానికి మధుసూదన్‌రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేని చోటకూడా అక్రమ మైనింగ్ చేపట్టారని, సబ్ కాంట్రాక్టులకు అనుమతి లేకున్నా జీవీఆర్ సంస్థకు సబ్ క్రాంట్రాక్లులచ్చారని కంపెనీపై ఫిర్యాదులున్నాయి. వాటితో పాటు అనుమతి తీసుకున్న చోట పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు చేపట్టి భారీగా కోట్లు కొల్లగొట్టారని సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీపై ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఈడీ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. కంపెనీకి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం.


