అల్లు అరవింద్‌ను ప్రశ్నించిన ఈడీ | ED Questions Allu Aravind in Rama Krishna Bank Scam | Sakshi
Sakshi News home page

Allu Aravind: బ్యాంక్‌ స్కామ్‌.. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ

Jul 4 2025 2:02 PM | Updated on Jul 4 2025 4:50 PM

ED Questions Allu Aravind in Rama Krishna Bank Scam

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravnid)ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ప్రశ్నించింది. ఓ బ్యాంక్‌ స్కామ్‌ గురించి ఆయన్ను విచారించింది. 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్ నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకున్నాయి. అలా తీసుకున్న రుణాలను సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 

పైగా తీసుకున్న లోన్ కూడా కట్టలేదట! ఈ రెండు సంస్థలు కొన్న ఆస్తుల్లో, చేసిన లావాదేవీల్లో అల్లు అర్జున్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్‌ను శుక్రవారం (జూలై 4న) విచారణకు పిలిచారు. రామకృష్ణ కంపెనీలు చేసిన బ్యాంక్‌ స్కామ్‌లో నిర్మాతకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో అధికారులు విచారణ జరిపారు. 2018- 19 మధ్యకాలంలో నిర్మాత జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తి కొనుగోళ్ల గురించి ఆరా తీశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. మళ్లీ వచ్చే వారం విచారణకు హాజరవ్వాలని ఈడీ అధికారులు.. అల్లు అరవింద్‌ను కోరారు.

చదవండి: తమ్ముడు మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement