కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్‌లో ఎక్కువగా వయొలెన్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని కియారాతో బోల్డ్ సాంగ్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే కన్నడ నటి రిషికా సింగ్ టాక్సిక్ చిత్రంపై విమర్శలు గుప్పించింది. ఈ ట్రైలర్‌లోని బోల్డ్ సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైలర్‌లో చూపించిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని తెలిపింది. యశ్ కూడా ఓ భర్తగా, తండ్రిగా మహిళల పట్ల గౌరవం చూపాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. మహిళలను గౌరవించకపోతే అతడిని కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తామంటూ మాట్లాడింది. అంతేకాకుండా నేను టాక్సిక్ అంటూ కామెంట్స్ చేసింది.
దీంతో రిషికా వ్యాఖ్యలపై నెట్టింట్ యశ్ అభిమానులు మండిపడుతున్నారు. 'టాక్సిక్'లోని సన్నిహిత సన్నివేశాలపై ఆమె చేసిన విమర్శలను ప్రశ్నిస్తున్నారు. రిషీకా గతంలో నటించిన చిత్రాలు, ఫోటోషూట్‌లకు సంబంధించిన క్లిప్‌లు కొందరు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది.
అసలు రిషికా సింగ్ ఎవరు?
కన్నడ భామ రిషికా సింగ్ 'కల్ల మల్ల సుల్లా', 'బెంకి బిరుగలి', 'కంతిరవ', 'తుంటరు' లాంటి చిత్రాలతో ఫేమస్ అయింది. ఆమె చిత్రనిర్మాత రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె కావడం విశేషం. అంతేకాకుండా బిగ్ బాస్ కన్నడ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.


