breaking news
Visal
-
‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఎక్కువమంది చదివింది: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?సంప్రదాయ వస్త్రధారణలో అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమాని చేసేందుకు ఓ పాఠశాల విద్యార్థులు ఢిల్లీలోని పీవీఆర్‌కు వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణలో పంచెకట్టుతో థియేటర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవలే ఈ సినిమా కోసం పడిన కష్టాలను డైరెక్టర్ విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’ हनुमान अंश ने सिनेमाघरों को सच में मंदिर बना दिया ❤️🚩PVR में गुरुकुल के युवा ब्रह्मचारियों ने जब #HanumanAnsh देखी, तो उनके चेहरों की चमक देखने लायक थी। 🙏यह सिर्फ फिल्म नहीं, हमारी संस्कृति, संस्कार और प्रभु हनुमान की भक्ति से जुड़ने का अनुभव है। 🇮🇳🚩#आ_गया_है_अवतार pic.twitter.com/fNVGglsGrh— Divya Singh (@DivyaSi51590883) September 7, 2026 -
ఒకే రోజు ఐదు సినిమాలు.. గెలిచేదెవరో..?
ఒక్కో సినిమాది ఒక్కో కథ. ఒక్కో దర్శకుడిది ఒక్కో కాన్సెప్ట్. ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్ వరకు, హారర్ నుంచి పీరియాడిక్ కథల వరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులను అలరించేందుకు ఐదు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాలపై అంచనాలను పెంచేశాయి. మరి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.విశ్వనాథ్ అండ్ సన్స్: సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమితా బైజు కథానాయికగా నటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.పళ్ళ బురుసు: ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పళ్ళ బురుసు'. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌లు నిర్మించిన ఈ సినిమా కూడా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.మకుటం: విశాల్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'మకుటం'. ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.అగధ: ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అగధ'. కామాక్షీ భాస్కర్ల, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆవారాపన్ 2: 'ఆవారపన్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా 'ఆవారపన్ 2'. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటాని నటించింది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.బట్వారా 1947: సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బట్వారా 1947'. ఈ చిత్రంతో ప్రీతి జింటా మళ్లీ వెండితెరపై కనిపించనుంది. షబానా ఆజ్మీ, అలీ ఫజల్, కరణ్ డియోల్, సర్గమ్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలా విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ సినిమాల్లో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
విశాల్ చిత్రానికి ముహూర్తం ఖరారు
తమిళసినిమా: నటుడు విశాల్ నటిస్తున్న తాజా చిత్రం తుప్పరివాలన్. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఆయన ఇంతకు ముందు లింగుస్వామి దర్శకత్వంలో నటించిన సండైకోళి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ రూపొందనున్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఎట్టకేలకు సండకోళి–2 చిత్ర ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 31వ తేదీన చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో విశాల్‌కు జంటగా అందాల నటి కీర్తీసురేశ్ నటించనున్నారు. మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నటిస్తున్నారు. సండకోళి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన నటుడు రాజ్‌కిరణ్ ఈ చిత్రంలోనూ విశాల్‌కు తండ్రిగా నటించనున్నారు. ఈ చిత్రం కోసం చెన్నైలో మదురైని దించే విధంగా బిన్ని మిల్లులోని 10 ఎకరాల స్థలంలో భారీ సెట్‌ను వేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. అందులో 500 దుకాణాలు, ఒక పెద్ద దేవాలయం చోటు చేసుకుంటాయట. ఈ సెట్లో విశాల్ ఇంట్రో సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు, అందులో వెయ్యిమందికి పైగా సహాయ నటులు, నృత్య కళాకారులు పాల్గొంటారని యూనిట్ వర్గాలు తెలిపారు. అదే విధంగా చిత్రంలోని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించడానికి దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 31న ప్రారంభం కానున్న సండకోళి–2 చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీత బాణీలు కడుతున్నారు. దీన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. -
రజనీ సినిమా టైటిల్‌తో మరోసారి విశాల్
తమిళసినిమా: నటుడు విశాల్ మరోసారి రజనీకాంత్ టైటిల్‌తో తెరపైకి రానున్నారు. పాండియనాడు, శివప్పు మనిదన్, పూజై చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ సాధించిన విశాల్ తాజాగా సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన పాండియనాడు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత నటించిన చిత్రం నాన్ శివపుప మనిదన్ చిత్రంలో నటించారు. ఇదే టైటిల్‌తో ఇంతకుముందు రజనీకాంత్ నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా నటిస్తున్న చిత్రానికి 1983లో రజనీకాంత్ నటించిన 'పులి' టైటిల్‌ను నిర్ణయించడం విశేషం. ఈ వేందర్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ను ఏప్రిల్ మూడు నుంచి నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేల్‌రాజా ఛాయాగ్రహణను, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


