breaking news
Venky atlluri
-
సూర్యలోని విశ్వాసమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయానికి కారణం: వెంకీ
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమిత బైజు నాయకిగా నటించిన ఇందులో నటి రాధిక శరత్ కుమార్, భవానీశ్రీ, సునిల్ రెడ్డి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను వెంకీ అట్లూరి నిర్వహించారు. జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళం భాషల్లో విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు.ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ నటుడు సూర్య తనకు చాలా కాలంగా తెలుసు అన్నారు. ఈ చిత్రంలో ఆయన ఎంతో పరిపక్వతతో నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం గురించి ఒక్క నెగిటివ్ విమర్శ వస్తుందని చూశానని, అయితే అన్ని పాజిటివ్ విమర్శలే రావడం విశేషం అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రతి విషయంలోనూ చాలా క్లియర్‌గా ఉన్నారన్నారు. తనకు బాగా నచ్చిన చిత్రం సూర్యవంశం అనీ, ఆ తరువాత విశ్వనాథ్ అండ్ సన్స్ అని పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర ప్రివ్యూను మీడియా మిత్రులతో కలిసి చూశానని, దీంతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డానని, అయితే ఆ తరువాత ప్రతి ఒక్కరూ బాగుందని అభినందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఇంతకు ముందు దర్శకత్వం వహించిన వాథ్తి, లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని, తాజాగా తమిళంలో చేసిన విశ్వనాథ్ అండ్ సనన్స్ చిత్రానికి గాను విజయాన్ని అందించారని పేర్కొన్నారు. నటుడు సూర్యలోని విశ్వాసమే ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం అని దర్శకుడు వెంకీ అట్లూ రి పేర్కొన్నారు. కాగా నటుడు సూర్య చైన్నెలో లేని కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేదు. -
విశ్వనాథ్ అండ్ సన్స్.. రిలీజ్‌కు ముందే బిగ్ డీల్స్
సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో దూసుకెళ్తోంది. ‘కరుప్పు’ విజయంతో సూర్య మార్కెట్ మరింత బలపడటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ విలువ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అడ్వాన్స్ బుకింగ్స్‌పైనే పడింది.తమిళనాడులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కాకపోయినా మోస్తరు స్థాయిలో కొనసాగుతున్నాయి. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ చిత్రం తమిళనాడులో రూ.7.23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌ను నమోదు చేసింది. ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లుఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ మొత్తం సుమారు రూ.215 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు ఉన్నాయి. తమిళనాడు థియేట్రికల్ హక్కుల విలువ రూ.45 కోట్లు కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ.5 కోట్లు, ఓవర్సీస్లో రూ.15 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లకు చేరింది. ఓటీటీ, శాటిలైట్, సంగీత హక్కులతో కూడిన నాన్-థియేట్రికల్ బిజినెస్ విలువ రూ.125 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల పరంగా ఈ చిత్రం విజయవంతం కావాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.175 కోట్ల గ్రాస్‌ను సాధించాల్సి ఉంటుంది.ఆగస్టు 14న రాబోతోంది..వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య, మమితా బైజు జంటగా నటించారు. రాధికతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరో సూర్య పాడిన పెళ్లి పాట రిలీజ్
హీరో సూర్యకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ సినిమా చేశాడు. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వచ్చే నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం 'బటర్ ఫ్లై' పాట విడుదల చేయగా.. ఇప్పుడు సూర్య పాడిన పాటని వదిలారు.(ఇదీ చదవండి: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు సినిమా కాదు)'వెడ్డింగ్ సాంగ్' అంటూ సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంది. ఇందులో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్) -
లక్కీ భాస్కర్ డేట్ ఫిక్స్
థియేటర్స్‌లోకి ‘లక్కీ భాస్కర్’ వచ్చే సమయం ఖరారైంది. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఈ సినిమా కొత్త ΄ోస్టర్‌ను కూడా బుధవారం విడుదల చేశారు మేకర్స్. ‘‘1980– 1990 కాలంలో నాటి బొంబాయి (ముంబై) నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఓ సాధారణ బ్యాంకు క్యాషియర్ అయిన లక్కీ భాస్కర్ అసాధారణ ప్రయణాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: నిమిష్ రవి. -
లక్ అంటే ఈ డైరెక్టర్లదే.. అప్పుడే స్టార్ హీరోలతో సినిమాలు!
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడు అయినా అనుకుంటారు. ఈ సువర్ణావకాశం కోసం కొందరు దర్శకులు చాలాకాలం ఎదురుచూస్తుంటారు. కానీ కొందరు డైరెక్టర్లకు మాత్రం తక్కువ సమయంలోనే స్టార్ హీరోకి ‘స్టార్ట్ యాక్షన్’ చెప్పే చాన్స్ వస్తుంది. ఇప్పుడలాంటి కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ‘స్టార్ హీరో’లు ‘యంగ్ కెప్టెన్’ (డైరెక్టర్లను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు)ల కాంబినేషన్లో సెట్ అయిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. సిల్వర్ స్క్రీన్‌పై రజనీకాంత్ క్రేజ్ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. ఇంతటి స్టార్డమ్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడు అయినా ఆశపడుతుంటారు. ఈ చాన్స్ కనీసం మూడు సినిమాలను కూడా తెరకెక్కించని ఓ దర్శకుడికి లభిస్తే అది కాస్త ఆశ్చర్యమే. తమిళ చిత్రం ‘డాన్’తో దర్శకుడిగా పరిచయమైన సిబీ చక్రవర్తికి చాన్స్ ఇవ్వనున్నారు రజనీకాంత్. ఆల్రెడీ ఈ సూపర్ స్టార్‌ను కలిసి సీబీ చక్రవర్తి ఓ లైన్ వినిపించారు. పూర్తి కథను రెడీ చేసి, నరేషన్ ఇస్తే సినిమా చేస్తానని సీబీ చక్రవర్తికి మాట ఇచ్చారట రజనీ. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా యువదర్శకుడే కావడం విశేషం. నెల్సన్ కెరీర్లో ‘జైలర్’ చిత్రం నాలుగోది. చిరంజీవి స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగాస్టార్ రీసెంట్గా యువదర్శకుడు వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో మంచి హిట్స్ సాధించిన జోష్‌లో వెంకీ కుడుముల ఉన్నా రన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చాక వెంకీ కుడుములతో చేసే సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ∙‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్. ఈ స్టార్ హీరో 25వ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్‌ను దక్కించుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. ‘స్పిరిట్’ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా హిట్ సాధించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కబీర్ సింగ్’గా తీసి, అక్కడా హిట్ సాధించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చాన్స్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నారు సందీప్. కెరీర్లో పాతిక సినిమాలు చేసి, అగ్రహీరోల జాబితాలో కొనసాగుతున్నారు హీరో ఎన్టీఆర్. అయితే జస్ట్ ఒకే ఒక సినిమా ‘ఉప్పెన’తో ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్న బుచ్చిబాబు సనకి అవకాశం ఇచ్చారు. రెండో సినిమానే యంగ్ టైగర్‌తో చేసే అవకాశం బుచ్చిబాబుకి లభించడం విశేషం. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం అవుతుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎనీ్టఆర్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఎన్టీఆర్–బుచ్చిబాబు సినిమా సెట్స్‌కి పైకి వెళుతుందట. ∙ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఖాతాలో ఓ భారీ సినిమానే ఉంది. ఈ సినిమాకి శంకర్ దర్శకుడు. ఈ చిత్రం తర్వాత చరణ్ నెక్ట్స్ మూవీ తెలుగులో ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్ సినిమాలను తీసిన యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు రామ్‌చరణ్ మరో యువ దర్శకుడితో సినిమా చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కన్నడంలో ‘మఫ్తీ’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై సూపర్ హిట్ సాధించిన నార్తన్యే ఈ దర్శకుడు. రామ్‌చరణ్ కోసం నార్తన్ ఓ కథను రెడీ చేశారట. ఇది చరణ్‌కు కూడా నచ్చిందట. దీంతో శంకర్ ప్రాజెక్ట్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా చేయబోయేది నార్తన్ దర్శకత్వంలోనే అనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా రామ్‌చరణ్‌కు ఓ కథ వినిపించారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. దర్శకుడిగా రెండు సినిమాలే (తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’) చేసిన వెంకీ అట్లూరి ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’) అనే సినిమా చేస్తున్నారు. అలాగే తమిళంలో 2021లో వచి్చన ‘రాకీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అరుణ్ మాథేశ్వరన్. ఆ తర్వాత ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) అనే సినిమా చేశారు. ప్రస్తుతం మూడో సినిమానే ధనుష్‌తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు అరుణ్. వీరిద్దరి కాంబినేషన్లో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. వీరే కాదు.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కేవీ అనుదీప్ ఇటీవల విక్టరీ వెంకటేశ్‌కు, ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజిత్‌కి పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందని టాక్. ఇంకా యువ దర్శకులతో సినిమాలు చేసే టాప్ హీరోల జాబితా పెరిగే అవకాశం ఉంది. -
వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా షూటింగ్లో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో సినిమాను స్టార్ట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరిన దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, కమర్షియల్ స్టార్ అనిపించుకునేందుకు కష్టపడుతున్నాడు. ముకుంద, కంచె లాంటి సినిమాలో ఆకట్టుకున్న వరుణ్, కమర్షియల్ జానర్లో చేసిన లోఫర్, మిస్టర్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఫిదా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.


