వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్ | Varun tej New Movie opening | Sakshi
Sakshi News home page

వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్

Jun 17 2017 10:55 AM | Updated on Sep 5 2017 1:52 PM

వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్

వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా షూటింగ్లో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో సినిమాను

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా షూటింగ్లో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో సినిమాను స్టార్ట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరిన దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, కమర్షియల్ స్టార్ అనిపించుకునేందుకు కష్టపడుతున్నాడు. ముకుంద, కంచె లాంటి సినిమాలో ఆకట్టుకున్న వరుణ్, కమర్షియల్ జానర్లో చేసిన లోఫర్, మిస్టర్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం సెట్స్  మీద ఉన్న ఫిదా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement