సూర్యలోని విశ్వాసమే ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ విజయానికి కారణం: వెంకీ | Venky Atluri Interesting Comments On Surya In Vishwanath And Sons Success Meet | Sakshi
Sakshi News home page

సూర్యలోని విశ్వాసమే ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ విజయానికి కారణం: వెంకీ

Aug 20 2026 9:49 AM | Updated on Aug 20 2026 10:00 AM

Venky Atluri Interesting Comments On Surya In Vishwanath And Sons Success Meet

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌. నటి మమిత బైజు నాయకిగా నటించిన ఇందులో నటి రాధిక శరత్‌ కుమార్‌, భవానీశ్రీ, సునిల్‌ రెడ్డి, నాజర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను వెంకీ అట్లూరి నిర్వహించారు. జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళం భాషల్లో విడుదలై సక్సెస్‌ ఫుల్‌ గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మంగళవారం సాయంత్రం చైన్నెలోని ఒక స్టార్‌ హోటల్లో థ్యాంక్స్‌ మీట్‌ను నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ నటుడు సూర్య తనకు చాలా కాలంగా తెలుసు అన్నారు. ఈ చిత్రంలో ఆయన ఎంతో పరిపక్వతతో నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం గురించి ఒక్క నెగిటివ్‌ విమర్శ వస్తుందని చూశానని, అయితే అన్ని పాజిటివ్‌ విమర్శలే రావడం విశేషం అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రతి విషయంలోనూ చాలా క్లియర్‌గా ఉన్నారన్నారు. తనకు బాగా నచ్చిన చిత్రం సూర్యవంశం అనీ, ఆ తరువాత విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ అని పేర్కొన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర ప్రివ్యూను మీడియా మిత్రులతో కలిసి చూశానని, దీంతో వారి రియాక్షన్‌ ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డానని, అయితే ఆ తరువాత ప్రతి ఒక్కరూ బాగుందని అభినందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఇంతకు ముందు దర్శకత్వం వహించిన వాథ్తి, లక్కీ భాస్కర్‌ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని, తాజాగా తమిళంలో చేసిన విశ్వనాథ్‌ అండ్‌ సనన్స్‌ చిత్రానికి గాను విజయాన్ని అందించారని పేర్కొన్నారు. నటుడు సూర్యలోని విశ్వాసమే ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం అని దర్శకుడు వెంకీ అట్లూ రి పేర్కొన్నారు. కాగా నటుడు సూర్య చైన్నెలో లేని కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement