మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర చేశాను : వేద జలంధర్‌ | Vedha Jalandhar Talk About Ameer Log | Sakshi
Sakshi News home page

మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర చేశాను : వేద జలంధర్‌

Aug 20 2026 8:53 AM | Updated on Aug 20 2026 8:56 AM

Vedha Jalandhar Talk About Ameer Log

‘‘అమీర్‌ లోగ్‌’ చిత్రకథ హైదరాబాద్‌లోని ఓ బస్తీ నేపథ్యంలో జరుగుతుంది. బస్తీ అన్నది సహజంగా ఉండాలని ఇక్కడి ఓ బస్తీలోని గృహాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం’’ అని వేద జలంధర్‌ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్‌ నిట్టూరు, విశ్వేందర్‌ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్‌ లోగ్‌’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా వేద జలంధర్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమీర్‌ లోగ్‌’లో నేను చేసిన గీత పాత్ర పక్కింటి అమ్మాయిలా, మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న ఓ సినిమా షూటింగ్‌ కాకినాడలో జరుగుతోంది’’ అని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement