బుర్రకథ అంటే ఏంటో చూపిస్తా..'గరివిడి లక్ష్మి' ట్రైలర్ చూశారా? | Garividi Lakshmi Movie Trailer | Sakshi
Sakshi News home page

Garividi Lakshmi Trailer: నాకు మోసపోవడం కొత్తేటి కాదు.. ట్రైలర్ రిలీజ్

Oct 6 2026 9:11 AM | Updated on Oct 6 2026 9:14 AM

Garividi Lakshmi Movie Trailer

ఉత్తరాంధ్ర ప్రజలకు గరివిడి లక్ష్మి అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుర్రకథ కళాకారిణిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పాటలు అప్పట్లో ఎంతలా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఈమె జీవితం ఆధారంగా తెలుగులో తీసిన సినిమా 'గరివిడి లక్ష్మి'. ఆనంది టైటిల్ రోల్ చేసింది. గౌరీనాయుడు జమ్ము దర్శకుడు. ఈ నెల 17న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

ఉత్తరాంధ్ర జానపద కళల వైభవాన్ని, గ్రామీణ మహిళ పోరాట పటిమని ఈ సినిమాలో చూపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఆనందితో పాటు రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, రాశి తదితరులు కీలక పాత్రలు చేశారు. 90స్ లో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవిత కథను ఈ ట్రైలర్‌లో శాంపిల్‌గా చూపించారు.

అక్టోబర్ 16న జైలర్ 2, రణబాలి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో గరివిడి లక్ష్మి చిత్రం.. ప్రేక్షకుల దృష్టిని ఏ మేరకు ఆకర్షిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement